HomeRangareddyMlc Kasireddy Narayana Reddy Said That He Submitted A Petition Along With Minister Ktr Asking For Funding For Bt Roads
బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలి
ల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి, వెల్దండ మండలాలకు బీటీ రోడ్లకు నిధులివ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.
మంత్రి కేటీఆర్‌ను కోరిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
తలకొండపల్లి డిసెంబర్ 1 : కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి, వెల్దండ మండలాలకు బీటీ రోడ్లకు నిధులివ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. తలకొండపల్లి మండలంలోని వీరన్నపల్లి గ్రామానికి వెల్దండ మండలంలోని తిమ్మనోనిపల్లి, బైరాపూర్, అజిలాపూర్ గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేయాలని కోరడంతో వెంటనే స్పందించి..
సంబంధిత శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరర్రావుతో మాట్లాడి పనులు మంజూరు చేయాలని సూచించారు. అడిగిన వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్సీ కృతజ్ఞతలు చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపారు.