షాద్‌నగర్ రూరల్,ఏప్రిల్30 : బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త, సామజిక తత్వవేత, విశ్వగురువు అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. వీరశైవ సమాజం అధ్వర్యంలో బుధవారం నిర్వహించిన బసవ జయంతి వేడుకలకు అయన హజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని మల్లికార్జున కాలనీలో గల బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ..కుల, మత, వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన గోప్ప వ్యక్తి బసవేశ్వరుడు అన్నారు.
అదేవిధంగా వీరశైవ సమాజం షాద్‌నగర్ అధ్యక్షుడు బోబ్బిలి ప్రవీణ్, గౌరవ అద్యక్షుడు బస్వం, ప్రదాన కార్యదర్శి పట్వారి శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ.. లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది, చిన్నతనంలోనే శివపురణాం గాదాలను అవగతం చేసుకన్న మహనీయుడు బసవేశ్వరుడు అన్నారు. అయన సూచించిన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు.
విశ్వగురువు బసవేశ్వరుడి జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం వీరశైవుల సహకరంతో ఘనంగా నిర్వహిస్తుడటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, తిరుపతిరెడ్డి, మాజీ కౌన్సిలర్ చింటు, వీరేశం, వీరశైవ సమాజం, సభ్యులు పాల్గొన్నారు.