యాచారం, అక్టోబర్ 5: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయానికి బతుకమ్మ పండుగ అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని గున్గల్ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలు, క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితోనే విదేశాలలో మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొంటున్నారన్నారు. బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకొనేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దసరా కానుకగా తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్రంలో 1.5కోట్ల చీరలను ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు.
మండలంలో 18 సంవత్సరాలు నిండిన 13 వేల మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. గ్రామీణ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించాలన్నారు. అనంతరం మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన జిట్టె రాములుకు రూ.36 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, డైరెక్టర్ తలారి మల్లేశ్, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, సర్పంచ్‌లు ఇందిర, జంగయ్య, కృష్ణ, హబీబుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు చిన్నోళ్ల యాదయ్య, యాదయ్యగౌడ్, ఖాజు, గోపాల్, భీం యాదవ్, రమేశ్, అచ్చన దానయ్య, భాష పాల్గొన్నారు.
మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి
షాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా ఆడబిడ్డలకు అందిస్తున్న చీరలను సద్వినియోగం చేసుకోవాలని వైస్ ఎంపీపీ జడల లక్ష్మి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ తమ్మలి సుబ్రహ్మణ్యేశ్వరితో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అదే విధంగా సీతారాంపూర్, మల్లారెడ్డిగూడ, హైతాబాద్, పెద్దవేడు, తాళ్లపల్లి, రేగడిదోస్వాడ తదితర గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. యువతకు కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. కార్యక్రమంలో ముద్దెంగూడ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, సర్పంచ్‌లు కొత్త పాండురంగారెడ్డి, చందిప్ప జంగయ్య, మల్లేశ్, శ్రీనివాస్‌గౌడ్, రాములు, పెంటయ్య, ఎంపీటీసీ గుత్తి సునీత, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈర్లపల్లి గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ
చేవెళ్ల రూరల్ : ఈర్లపల్లి గ్రామంలో ప్రభుత్వం అందజేసిన బతుమక్మ చీరలను ఎంపీడీవో హిమబిందు సర్పంచ్ రాజశేఖర్‌తో కలిసి అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సంకటోనిపల్లి గ్రామంలో గురువారం కౌన్సిలర్ కమఠం రాధమ్మ మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కమఠం వెంకటయ్య, కాలె విక్రమ్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్‌సుందర్, గ్రామస్తులు చంద్రకళ, ఎల్లయ్య, బాలకృష్ణయ్య, జైపాల్, పెద్దయ్య, మమత, భాగ్యమ్మ, అనంతమ్మ, జంగమ్మ పాల్గొన్నారు.
క్రీడా సామగ్రి అందజేత
కడ్తాల్ : మండలంలోని క్రీడాకారులకు ప్రభుత్వం అందజేస్తున్న క్రీడా సామగ్రిని ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ గురువారం క్రీడాకారులకు అందజేశారు. క్రీడల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, ఏంపీవో మధుసూదనాచారి, సర్పంచ్‌లు హరిచంద్‌నాయక్, పాండూనాయక్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.