ఇబ్రహీంపట్నం, జూన్ 15 : ప్రజాప్రభుత్వంలో మహిళల ఆర్థికాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో ఇబ్రహీంపట్నం మండలంతో పాటు ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీలకు చెందిన 92మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిందని, త్వరలో మరిన్ని హామీలు నెరవేరుస్తామన్నారు.
రాబోయే రోజుల్లో మహిళలు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ప్రభుత్వం తోడ్పాటునందించనుందన్నారు. అలాగే, త్వరలోనే ఆడపిల్లల వివాహానికి తులం బంగారం కూడా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ మహిపాల్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్‌రెడ్డి, వైస్‌చైర్మన్ మంగ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్ పాండురంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకల మధుసూదన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని శివగార్డెన్లో తహసీల్దార్ రవీందర్దత్తు ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై 113 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ రేఖామహేందర్‌గౌడ్, జడ్పీటీసీ దాస్‌గౌడ్, వైస్‌ఎంపీపీ కొలన్ శ్రీధర్‌రెడ్డి, పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్‌చైర్‌పర్సన్ సంపూర్ణ, తహసీల్దార్ రవీందర్దత్తు, నాయకులు మధుసూదన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మహేందర్‌గౌడ్, విజయశేఖర్‌రెడ్డి, చిరంజీవి, మాజీ సర్పంచ్‌లు యశోదాఊషయ్యగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్‌గౌడ్, ఎంపీటీసీలు వెంకటేశ్, బాలమ్మ, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, రాజేందర్, గీత, శ్రీలత పాల్గొన్నారు.