ఆమనగల్లు, డిసెంబర్ 25 : ఏసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. మాడ్గుల మండలంలోని అన్ని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇర్విన్ రెడ్డిపురం, కలకొండ రెడ్డిపురం, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చర్చి పాస్టర్లు ఎమ్మెల్యేను సన్మానించారు. తదనంతరం చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, కేక్ కటింగ్, సాం స్కృతిక నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా ఆమనగల్లు పట్టణంలోని ఫిలదేల్పియా ఎంబి చర్చి లో పాస్టర్ జాన్‌రాజు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. బైబి ల్ అందజేశారు. కార్యక్రమంలో పంతూనాయక్, పురుషో త్తం, రాబర్ట్, సామేల్, నర్సింహ, సంజీవ, రాజు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : సమస్త మానవాళిని బాధల నుంచి తప్పించేందుకు శిల్వను మోసిన కరుణమయుడు ఏసుప్రభువు అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్ లోని జియోన్ ఎంబీ చర్చి, ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ నీడ్ సంస్థ ఆశ్రమంలో సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితో కలిసి పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసు చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలన్నారు కేక్‌ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, క్రైస్తవులు పాల్గొన్నారు.
నందిగామ: కొత్తూరు మండలంలోని ఫాతిమపూర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకల్లో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డిలు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేసి, క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, క్రైస్తవ మత పెద్దలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కడ్తాల్ : కడ్తాల్ యోహోవా నిస్సీ కృపా మందిరంలో సఫియా నవాబ్‌పాషా ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం పాస్టర్ కేక్‌ని కట్ చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కృపా మందిరం వద్దకు వెళ్లి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, పాస్టర్లు డేవిడ్‌రాజు, సోఫియీబేగం, యోబు దినకర్, నాయకులు నర్సింహ, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : అంతారం, ఖానాపూర్, ఆలూర్, మల్కాపూర్ తదితర గ్రామాల్లోని ప్రార్థన మందిరాల్లో ఉదయం నుంచే భారీగా క్రైస్తవులు తరలివచ్చి ప్రార్థనలు చేశారు. దామరగిద్ద గ్రామంలోని చర్చిలో చిన్నారుల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
పెద్దఅంబర్‌పేట : మున్సిపాలిటీలోని పలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పెద్దఅంబర్‌పేట 5వ వార్డులోని చర్చిలో పాస్టర్ నూక బత్తిని హేమా రవికుమార్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు చేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కేక్ కట్‌చేశారు. వేడుకల్లో వివిధ పార్టీల నాయకులు జగన్, బొర్ర సురేశ్, ప్రహ్లాద్ పాల్గొన్నారు.
శంకర్పల్లి : మున్సిపాలిటీ, మండల పరిధిలోని చర్చిలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరణ చేశారు. ఉదయం నుంచి భక్తి శ్రద్ధలతో చర్చిలలో ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సంజిత్‌కుమార్, చర్చి పాస్టర్లు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు కొత్త దుస్తులు ధరించి, ఉదయం నుంచే చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. చర్చిల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, క్రైస్తవులు పాల్గొన్నారు.
మంచాల : మంచాల ఎంబీ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్‌చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు విష్ణువర్ధన్‌రెడ్డి, జగన్‌రెడ్డి, నాయకులు మహేందర్‌రెడ్డి, అశ్వల బాల్‌రాజ్, అండెం శశిధర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చర్చి పాస్టర్ సుధీర్, పాస్టర్ అమ్మ సంఘం సభ్యులు దేవదాస్, యాదమ్మ, కీర్తన భార్గవి, సంతోష్ పాల్గొన్నారు.
షాబాద్ : షాబాద్ మండలంలో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకొన్నారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజును క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో అందంగా ముస్తాబైన చర్చిల్లో అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. షాబాద్ హోలీస్పీరిట్, పాఠశాలలో, మరియాపురం ఆరోగ్యమాత చర్చిలో, షాబాద్ చర్చిలో గ్రామస్తులంతా ఉదయం నుంచే ప్రార్థనలు నిర్వహించారు.
తుర్కయంజాల్ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ బాలఏసు పుణ్యక్షేత్రంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
యాచారం : మేడిపల్లి, మల్కీజ్‌గూడ, యాచారం, గున్గల్, తులేఖుర్ధు, నజ్దిక్‌సింగారం, నందివనపర్తి, చింతపట్ల, తక్కళ్లపల్లితండా, తాడిపర్తి, కుర్మిద్ద తదితర గ్రామాల్లో పాస్ట ర్లు, మత పెద్దలు చర్చిల్లో బైబిల్‌ను బోధించారు. తక్కళ్లపల్లితండా సమీపంలోని బాలగ్రామ్ చర్చిలో అనాథ పిల్లలు క్రిస్మస్ను నిర్వహించారు. శాంతాతాత వేషదారుడు చిన్నారులను ఎంతగానో అలరించాడు. ఏసుక్రీస్తును స్మరిస్తూ ప్రత్యేక గీతాలను ఆలపించారు. కొవ్వొత్తులను ప్రదర్శిస్తూ ర్యాలీలు నిర్వహించారు. నందవనపర్తిలో క్రైస్తవులు ప్రజాప్రతినిధులు, నాయకులను సన్మనించారు.