చేవెళ్లరూరల్, అక్టోబర్ 27 : సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోమారు బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల, అనుబంధ గ్రామం మొండివాగు, దేవునిఎర్రవల్లి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఎమ్మెల్యే కాలె యాదయ్య సర్పంచ్‌లు జహంగీర్, సామ మాణిక్యరెడ్డితో కలిసి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ చేవెళ్ల మరింత అభివృద్ధి చెందాలంటే మరోమారు తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివ ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ మండల బీసీసెల్ అధ్యక్షుడు రాములు, బీఆర్ఎస్ నాయకులు రమణారెడ్డి, కృష్ణారెడ్డి, రైతుబంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శులు నరేందర్‌గౌడ్, హన్మంత్‌రెడ్డి, దేవునిఎర్రవల్లి ఉప సర్పంచ్ లతానర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు సామ రంగారెడ్డి, సామ విఠల్‌రెడ్డి, ఎదిరె మాణిక్యం, వార్డు సభ్యులు మల్లేశ్, హరీశ్, రాములు, పీఏసీఎస్ డైరెక్టర్ శ్యామలయ్య, నాయకులు ఎదిరె శ్రీశైలం, జంగయ్యగౌడ్, సర్పంచ్‌లు శేరి స్వర్ణలతాదర్శన్, వెంకటేశంగుప్తా, విజయలక్ష్మీనర్సింహులు, భీమయ్య, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అబ్దుల్గని, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్, బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్‌రెడ్డి, శేరి రాజు, శేరి శ్రీనివాస్, సాయినాథ్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.