ధారూరు, జనవరి 9: గ్రామాల్లో ప్రభుత్వం ఇంటింటికీ సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటిని వృథా చేయొద్దని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి ప్రజలకు సూ చించారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చాలా గ్రామాల్లో నీటిని వృథాగా మురుగు కాలువల్లోకి వదులుతున్నారన్నారు. నీరు వృథా చేయకుండా ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ప్రభు త్వం నిర్మించిన మరుగుదొడ్లను ప్రతిరోజూ వినియోగించాలని సూచించారు. దీంతో గ్రామాలు శుభ్రంగా ఉంటాయన్నారు. పల్లెలు పచ్చగా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిఏడాది హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు చెప్పారు.
అదేవిధంగా వైద్య, ఆరో గ్య శాఖ అధికారులు గర్భిణులు తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలను సూచించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, ధారూరు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, హరిదాస్‌పల్లి పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో చంద్రశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ భువనేశ్వర్, ఎంఈవో బాబుసింగ్, మండల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి, ఎంపీవో సురేశ్, ఎంపీవో, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
బంట్వారం అభివృద్ధ్దికి రూ. 50 లక్షలు
బంట్వారం, జనవరి 9: జిల్లాలో బంట్వారం మండలం అభివృద్ధికి దూరంగా ఉన్నదని, ఆ మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. సోమవారం మం డల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలాభివృద్ధికి గతంలోనూ నిధులను కేటాయించిన ట్లు.. అయినా మరింత అభివృద్ధి జరుగాల్సిన అవసరం ఉన్నదని.. అందుకోసం తన జడ్పీ నిధుల నుంచి రూ 50 లక్షలను మంజూరు చేస్తానని జడ్పీచైర్‌పర్సన్ తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధు లు సమన్వయంగా వ్యవహరించి మండలాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చే యాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, అం డర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పల్లెప్రకృతివనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, హరితహారం నర్సరీలు, గ్రామానికో ట్రాక్టర్, ట్రాలీ వంటి తదితర అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం కోట్లాది రూపాయలను మంజూరు చేసినట్లు వివరించారు. మండలవాసులందరూ ఇంటి పన్నులను సకాలంలో చెల్లించి గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, జడ్పీటీసీ సంతోష, ఎంపీడీవో బాలయ్య, ఎంపీటీసీలు , సర్పంచ్‌లు పాల్గొన్నారు.
విద్యార్థినులు బాగా చదువుకోవాలి
తాండూరు రూరల్, జనవరి 9: విద్యార్థినులు బాగా చదువుకుని జీవితంలో మంచిగా స్థిరపడాలని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆమె మండలంలోని జినుగుర్తి గ్రామ సమీపంలో ఉన్న గిరిజన బాలికల వసతి గృహాన్ని సందర్శించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకుందన్నారు. గురుకులంలో చదువుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని.. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందని ఇల్లు అంటూ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనితా గౌడ్, జడ్పీటీసీ మంజుల, వైస్ ఎంపీపీ స్వరూప, పీఏసీఎస్ చైర్మన్ రవిగౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ పార్వతమ్మ పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి
కోట్‌పల్లి, జనవరి 9: రైతుల రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వికారాబాద్ జడ్పీచైర్‌పర్సన్ సునీతారెడ్డి సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో ఆమె సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల్లో భాగంగా రైతుల ఒకరి భూమి మరొకరి పేరున పడటంతో వారు ఇబ్బందులకు గురవుతారని.. అందువల్ల ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ తహసీల్దార్ భరత్‌గౌడ్‌కు సూచించారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా మండలంలో తొమ్మిది బడులను ఎంపిక చేసి రూ.30 లక్షలతో మూడు పాఠశాలల్లో పనులను పూర్తి చేసినట్లు మిగతా 6 పాఠశాలల్లో పనులను టెండర్ వేసి ప్రారంభిస్తామని విద్యాశాఖ అధికారి చంద్రప్ప జడ్పీచైర్‌పర్సన్‌కు వివరించారు. అనంతరం వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులతో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో 100 శాతం పన్నులను వసూ లు చేయాలని ఎంపీవోకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ విజయ్‌కుమార్, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.