తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలం ప్రొద్దటూర్ గ్రామంలో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రజకుల కోసం మోడ్రన్ దోభీఘాట్లను తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
– శంకర్పల్లి, ఆగస్టు 20
శంకర్పల్లి, ఆగస్టు 20 :తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం ఆమె మండలంలోని ప్రొద్దటూర్ గ్రామం లో ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీచైర్ పర్సన్ అనితారెడ్డితో కలిసి వీరవనిత చాక లి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. భావితరాలకు తెలంగాణ పోరాట యోధుల జీవిత చరిత్రను తెలపాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వారి జయంతులు, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా రజకుల కోసం మాడ్రన్ దోభీఘాట్లను ప్రభు త్వం నిర్మించిందన్నారు.
ముఖ్యమంత్రి రైతుబంధు ఇస్తూ రైతు పక్షపాతిగా.. దళితబంధు ఇస్తూ దళితుల పక్షపాతిగా, మ హిళా సంక్షేమానికి పాటుపడుతూ మహిళల పక్షపాతిగా నిలిచారన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రాష్ర్టాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త లు అండగా ఉండి ఆశీర్వదించాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని.. ఆ ప్రాజెక్టు పూర్తైతే ఉమ్మడి రంగారె డ్డి జిల్లావాసులకు సాగు, తాగునీటిని ఢోకా ఉండదన్నారు. ప్రపంచంలోని వివి ధ దేశాలకు చెందిన పలు బహుళ జాతీయ సంస్థలు, కంపెనీలు మన దగ్గర పెట్టుబడు లు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయం టే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చర్యలే కారణమని ఆమె పేర్కొన్నారు. రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని .. అందువల్ల రానున్న ఎన్నిక ల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మె జార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు మనమంతా అండగా నిలుద్దామని మంత్రి పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ చాకలి ఐలమ్మ లాంటి మహనీయుల జీవితాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే మన రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. పథకాలు ఇంటింటికీ అందుతున్నాయని.. వాటి ద్వారా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో 60 ఏండ్లలో జరుగని అభివృద్ధి కేవలం తొమ్మిదేండ్లలోనే జరిగిందని.. దీనికి కారణం సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలేనని ఆయన కొనియాడారు. రైతుల బాధలు తెలిసిన మన సీఎం అన్నదాతలు ఇబ్బంది పడొద్దనే ఉద్దే శంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ఆదుకుంటున్నారన్నారు. రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకోవద్దని రూ.లక్ష లోపు పంట రుణాలను మా ఫీ చేసి రైతు బాంధవుడయ్యాడన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి కూ డా కేసీఆర్‌ను సీఎంగా గెలిపించి రాష్ర్టాన్ని కాపాడుకుందామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాపారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకటేశ్, సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ ప్రవళికావెంకట్రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజూనాయక్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ, మండల అద్యక్షులు వాసుదేవ్‌కన్నా, గోపాల్, మండల యూత్ అద్యక్షుడు ఇం ద్రసేనారెడ్డి, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఫరీద్, వెంకట్‌రెడ్డి, కాంత్‌రెడ్డి, బాలకృష్ణ, మహేందర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
మోమిన్‌పేట : దేవరంపల్లి గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ పెట్రోల్ పంపును ఆదివారం మంత్రి సబితారెడ్డి రంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, యాదయ్యలతో కలిసి ప్రారంభించారు.