రంగారెడ్డి, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ‘బొకేలు, శాలువాలొద్దు.. నోట్‌బుక్స్, స్టేషనరీ ఇవ్వండి, అంగన్వాడీ చిన్నారులకు మ్యాట్లు ఇవ్వండి.. మీ గ్రామాలు, మీ వార్డుల్లోని బడులను దత్తత తీసుకోండి, డబ్బును వృథా చేయకుండా ఒక మంచి పనికి వినియోగించండి’ అంటూ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రానున్న నూ తన సంవత్సరాన్ని పురస్కరించుకుని తనను కలిసేందుకు రావాలనుకున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలను ఉద్దేశించి మంత్రి పై విధంగా పేర్కొన్నారు.
మీరు చేసే చిన్న సాయం భవిష్యత్తు తరాలకు వెలుగులు నింపేదిగా ఉండాలని.. రా నున్న నూతన సంవత్సరం సందర్భం గా అందరూ ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకొని దానిని తప్పకుండా అమలు చేయాలని మంత్రి సూచించారు.