సమస్యల పరిష్కారానికి చర్యలు

ఉప్పల్, జూన్ 25: వరద సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. హబ్సిగూడ డివిజన్లోని సాయిచిత్రనగర్, లక్ష్మినగర్, రవీంద్రనగర్కాలనీల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనకాలంలో వరదనీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాలను గుర్తించి, సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ పనులు, మ్యాన్‌హోల్స్‌లో మట్టితొలగింపు, వరదనీటితో కూలిపోయిన ఓయూ ప్రహరీ నిర్మాణం అంశాలపై చర్చించారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తూ, అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి వరద ముంపు సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, డీఈ నాగమణి, ఇరిగేషన్ డీఈ పవన్, ఏఈ పృథ్వీ, జలమండలి డీజీఎం శ్రీధర్‌రెడ్డి, నేతలు అజిత్‌రెడ్డి, నగేశ్, సోమిరెడ్డి, ఉపేందర్‌రెడ్డి, మల్లయ్య, పరమేశ్వర్చారి, సీతారాం, వసుంధరరెడ్డి, నరసింహారెడ్డి, వనంపల్లి గోపాల్‌రెడ్డి, గరిక సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి
చర్లపల్లి: నియోజకవర్గం పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ మధుసూదన్రెడ్డినగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు శుక్రవారం ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలనీల్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా కాలనీలో డ్రైనేజీ, తాగునీటి సమస్య పరిష్కరించేందుకు పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు జాండ్ల ప్ర భాకర్‌రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు శ్రీధర్, రాములు, సోమేశ్, సుమన్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

