వరదలు రాకుండా చర్యలు

చర్లపల్లి, జూన్ 24: నియోజకవర్గం పరిధిలోని వరద ముప్పు ప్రాంతాల్లో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డినగర్, నాగార్జుననగర్ కాలనీ, సాయినగర్ తదితర ప్రాంతాల్లో ఆయన స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం పరిధిలో డ్రైనేజీ సమస్యలను తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే వర్షాకాలంలో వర్షం నీరు, డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. డివిజన్ పరిధిలోని నాగార్జుననగర్ కాలనీలో అసంపూర్తిగా ఉన్న రహదారుల నిర్మాణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించనున్నామని, కృష్ణారెడ్డినగర్‌లో ప్రధా న రహదారులతో పాటు అంతర్గత రహదారులలో వర్షం నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఆలయాల అభివృద్ధికి కృషి..
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని నాగార్జుననగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన దుర్గమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో కలిసి హాజరయ్యా రు. కార్యక్రమంలో సీసీఎస్ ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, నాయకులు డప్పు గిరిబాబు, కర్రె సత్యనారాయణ, రెడ్డినాయక్, ఎస్కే కరీం, కుమారస్వామి, మహ్మద్ బాజీబాషా, బాబు గంగపుత్ర, పరశురాం, బసంత్‌రెడ్డి, సత్యంయాదవ్, కిష్టమ్మ, విజయ, మాధవి, అండాలు, సురేశ్‌రెడ్డి, రవిప్రకాశ్ పాల్గొన్నారు.
స్వచ్ఛ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి
చర్లపల్లి: చర్లపల్లి డివిజన్‌ను స్వచ్ఛ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని జేఎన్ఎన్యూఆర్ఎం ఇందిరమ్మకాలనీలో పారిశుధ్య పనులను ఆమె పరిశీలించారు. డివిజన్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, బాబు గంగపుత్ర, జయకృష్ణ, యశ్వంత్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
పనులను త్వరితగతిన పూర్తి చేస్తాం..
డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేటర్ శ్రీదేవి చెప్పారు. గురువారం డివిజన్ పరిధిలోని సెయింట్ జోసెఫ్కాలనీలో చేపట్టిన సీసీరోడ్డు పనులను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

