వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కృషి : చక్రపాణి
విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని టీజీ ఎస్పీడీసీఎల్ డైరక్టర్ చక్రపాణి పేర్కొన్నారు.
చర్లపల్లి, నవంబర్ 30 : విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని టీజీ ఎస్పీడీసీఎల్ డైరక్టర్ చక్రపాణి పేర్కొన్నారు. చర్లపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని సాయినగర్, తదితర కాలనీలలో విద్యుత్ చీఫ్ ఇంజినీర్ కామేశ్, హబ్సిగూడ విద్యుత్ సర్కిల్ సూపరింటిండెంట్ ఆఫ్ ఇంజినీర్ వెంకన్నలతో కలిసి ఆయన బస్తీబాటా నిర్వహించి విద్యుత్ సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ కాలనీలలో నెలకొన్న విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా బస్తీబాటా నిర్వహించి స్థానిక సమస్యలను పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సైనిక్‌పురి డివిజన్ డీఈ అన్వర్‌పాషా, చర్లపల్లి ఏడీఈ రాందాస్, ఏఈ బాల్రాజులతో పాటు విద్యుత్ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

