రామంతాపూర్, ఏప్రిల్ 5 : ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. రామంతాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ నగర్ కాలనీలో 33 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మొదటి అంతస్తు కమ్యూనిటీ హాల్‌ను శనివారం కార్పొరేటర్ బండారు శ్రీవాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఏ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజల విజ్ఞప్తి చేశారు.
కాలనీలో అభివృద్ధి చెందినప్పుడే నియోజకవర్గ మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు కాలనీలో లక్షలాది రూపాయల అభివృద్ధి పనులు సాగుతున్నాయని, వాటిని వేగవంతం చేసి పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ రెడ్డి, గంధం నాగేశ్వర్ రావు, సీనియర్ నాయకులు బోసాని పవన్ జహగీర్, కాలనీ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.