200 మంది ఆటో డ్రైవర్లకు మంత్రి మల్లారెడ్డి నిత్యావసరాలు పంపిణీ

మేడ్చల్ మల్కాజ్గిరి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం అదేవిధంగా జవహర్ నగర్ కార్పొరేషన్ బాలాజీనగర్ మెయిన్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, జవహర్నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ప్రణీత గౌడ్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, స్థానిక టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, కొండల్, తదితరులు పాల్గొన్నారు.

200 ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల పంపిణీ..
జవహర్నగర్ కార్పొరేషన్ 5వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మూర్గేష్ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 200 మంది ఆటో డ్రైవర్లకు మంత్రి బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో పేదలను ఆదుకుంటున్న దాతలకు మంత్రి ధన్యవాదములు తెలిపారు.
జర్నలిస్టు కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థికసాయం..
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇటీవలే మృతి చెందిన నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ శంకర్ కుటుంబ సభ్యులను మంత్రి ఇంటికివెళ్లి పరామర్శించారు. రూ. 4 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

