Jail | జైలు అంటే శిక్షించే సంస్థ కాదు.. శిక్షణ ఇచ్చే సంస్థగా గుర్తింపు తీసుకురావాలి : ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
Jail | నేటి యుగంలో విద్య అందరికి అవసరమని, సమాజ అభివృద్ధి కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కృషి చేస్తుందన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి. కేంద్ర కారాగరంలో శిక్ష అనుభవించే ఖైదీలకు విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
Jail | చర్లపల్లి, జూలై 20 : కేంద్ర కారాగారం అంటే శిక్షించే సంస్థ కాదని, శిక్షణ ఇచ్చే సంస్థగా గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఆదివారం ప్రొఫెసర్ రామిరెడ్డి మెమోరియల్ యాక్టివిటీస్‌లో భాగంా బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఖైదీల కోసం లీగల్ రైట్స్ అండ్ పర్సనాలిటి డెవలప్మెంట్ అంశంపై అవగాహన కారక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి యుగంలో విద్య అందరికి అవసరమని, సమాజ అభివృద్ధి కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కృషి చేస్తుందన్నారు. కేంద్ర కారాగరంలో శిక్ష అనుభవించే ఖైదీలకు విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్ప చక్రపాణి మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసిన తప్పులను ఖైదీలు సరిదిద్దుకొని విద్యను అందిపుచ్చుకొవాలని సూచించారు. జైలు జీవితం అనంతరం ఖైదీలకు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంక్షేమానికి జైళ్ల శాఖ కృషి చేస్తుందని, ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ బీనా చింతలపూరి కుటుంబం మానవ విలువలపై అవగాహన కల్పించగా ప్రొఫెసర్ మురళీకృష్ణ న్యాయం పొందే హక్కులపై అవగాహన కల్పించారు.
అదేవిధంగా ప్రొఫెసర్ సుధారాణి ఖైదీల న్యాయమైన హక్కులు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు కాళిదాస్, శశికాంత్, రామయ్య, జైలర్ జ్యోతిర్మయిరెడ్డిలతో పాటు డిప్యూటీ జైలర్లు, వార్డెన్లు, ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.
Read Also :
Yellareddypet | పల్లెను మరిచిన ప్రభుత్వం.. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
Siddaramaiah | డీకే శివకుమార్ పేరెత్తిన కార్యకర్త.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

