నిధులివ్వరా..? నేరాల కట్టడి ఎట్లా?
గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉండగా కొన్నినెలలుగా ఒక్క పైసా విడుదల చేయడం లేదు. దీంతో స్టేషన్లో చిన్న గుండుసూది మొదలు.. డీజిల్ వరకు సొంతంగా భరించాల్సి రావడంతో పోలీసులు అయోమయంలో పడిపోతున్నారు.
- స్టేషనరీ నుంచి డీజిల్ వరకు అన్ని ఖర్చులూ పోలీసులవే
- ఒక్క రూపాయీ విడుదల చేయని ప్రభుత్వం
- స్టేషన్‌కు వచ్చేవారిపై ఆధారపడే పరిస్థితి
- బీఆర్ఎస్ హయాంలో పీఎస్‌ల నిర్వహణ భేష్
సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరించాల్సి ఉండగా కొన్నినెలలుగా ఒక్క పైసా విడుదల చేయడం లేదు. దీంతో స్టేషన్లో చిన్న గుండుసూది మొదలు.. డీజిల్ వరకు సొంతంగా భరించాల్సి రావడంతో పోలీసులు అయోమయంలో పడిపోతున్నారు. ఒకవైపు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల వద్ద ఒక్కరూపాయి కూడా తీసుకోవద్దని చెబుతున్న ప్రభుత్వం స్టేషన్ నిర్వహణ కోసం మెయింటెనెన్స్ నిధులు మాత్రం ఇవ్వడం లేదు. గత పదేళ్లలో ఎప్పుడూ లేని దుస్థితి ఇప్పుడు వచ్చిందని పోలీసులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు పోలీస్స్టేషన్ల నిర్వహణకు ప్రభుత్వాలు ఎలాంటి నిధులు ఇచ్చేవి కావు. దీంతో పోలీసులు ఎంతో కొంత ఫిర్యాదు దారుల నుంచి వసూలు చేయాల్సి వచ్చేది. ఈ దుస్థితి ఉండొద్దని తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటైన కేసీఆర్ సర్కార్ ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు స్థాయిలను బట్టి మెయింటెనెన్స్ కింద నిధులు కేటాయించింది. దీంతో పీఎస్ ఖర్చుల కోసం ఫిర్యాదుదారులను పీడించడం తగ్గిపోయింది. కానీ మళ్లీ పోలీసుల అవస్థలు , ఫిర్యాదుదారుల నుంచి డబ్బులు తీసుకోవడాలు ఈ ప్రభుత్వం వచ్చాక మొదలయ్యాయి.
తమ జేబుల నుంచే పెట్టుకోవాలి..!
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 71 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతీ పోలీస్ స్టేషన్‌కు నెలవారీ నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.75 వేలు ప్రభుత్వం విడుదల చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పీఎస్‌ల మెయింటెనెన్స్ ఖర్చుల విషయంలో ఎప్పుడూ వెనకాడలేదు. నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయడం వల్ల పోలీసులు తమ స్టేషన్ల నిర్వహణ కోసం వేరేవారిపై ఆధారపడకుండా ఉండేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రధానంగా నగరంలోని కమర్షియల్ డివిజన్ పరిధిలో ఉన్న రెండు పోలీస్ స్టేషన్లలో వీఐపీల రద్దీ కొనసాగుతుంది. ఇక్కడికి వచ్చే ఫిర్యాదుదారుల కంటే వీఐపీలు, ఉన్నతాధికారులే ఎక్కువగా వస్తుండటంతో మెయింటెనెన్స్ తడిసి మోపడవుతున్నది. అసలే మెయింటెనెన్స్ రాక తలలుపట్టుకుంటుంటే వచ్చే వారికి మర్యాదలు చేయాల్సి రావడం.. ఒకవేళ వారిని పట్టించుకోకపోతే తమపై అధికారులు ఎలా స్పందిస్తారో తెలియక స్టేషన్ ఆఫీసర్లు ఆందోళన చెందుతున్నారు. తమ జేబుల నుంచి ఈ మెయింటెనెన్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తున్నదని చెబుతున్నారు.
స్టేషనరీ మొదలు డీజిల్ వరకు..!
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతీనెలా పోలీస్ స్టేషన్లకు మెయింటెనెన్స్ రాక పోలీసులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. డీజిల్ కోసం పెట్రోల్ బంక్‌లకు వెళ్లి ఖాతా పెడుతున్నారు. అయితే ఈ మెయింటెనెన్స్ కూడా స్టేషన్‌కు వచ్చే వారి దగ్గరి నుంచో లేక ఎవరైనా లీడర్లు పీఎస్ నిర్వహణకు ఉంచుకోండంటూ ఇస్తేనో పెట్టుకోవలసి వస్తోంది తప్ప ప్రభుత్వం నుంచి పైసా రావడం లేదని.. తాము దర్యాప్తు జరపాలంటే కూడా కష్టమే అవుతోందని పోలీసులు వాపోతున్నారు. పెండింగ్ కేసులు పెరుగుతున్నాయంటూ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు.. నిందితులను పట్టుకోలేరంటూ చీవాట్లు.. వీటన్నిటికీ కారణం ఒక్కటే డబ్బులు లేకపోవడం. తాము నిందితుల కోసం గాలించే సమయంలో డబ్బులు ఇస్తాం.. మీరు పెట్టుకోండంటూ చెప్పి ఆ తర్వాత ఇవ్వకపోవడంతో దర్యాప్తు ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతుందని ఒక పోలీస్ అధికారి చెప్పారు. తమను డబ్బులు తీసుకోవద్దంటూనే ఇంత ఖర్చు ఎలా భరించాలో ప్రభుత్వమే చెప్పాలంటూ ప్రశ్నించారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

