Dundigal | దుండిగల్, మార్చి 20: నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వినియోగించే వారిపై చర్యలు తప్పవని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఎన్. వేంకటేశ్వర్ నాయక్ హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్‌లో భాగంగా కిరాణాషాపులు, హోటల్స్, రెస్టారెంట్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (120 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ )ను వాడవద్దని వివరించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై అవగాహన కల్పించేందుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు.
ముఖ్యంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడే కిరాణా షాపులు, హోటల్స్ , చికెన్ మటన్ దుకాణాలపై రైడ్ చేసి సింగల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయించే వారికి పెనాల్టీ విధించడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడే వారికీ రూ. 26,500 జరిమాన విధించారు. అదేవిధంగా ప్లాస్టిక్ బదులు అందరూ జ్యూట్ బ్యాగులు, చేతి కర్ర సంచులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ బి లక్ష్మయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ కే అంజయ్య, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ పి సాత్విక్, వార్డ్ ఆఫీసర్లు, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.