జవహర్నగర్, మే 20: హైదరాబాద్ బాలాజీ నగర్లోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న దివ్యాంగుడైన జితేందర్ శర్మను గాయపర్చిన వారిని కఠినంగా శిక్షించాలని దివ్యాంగ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సమితి ప్రధాన కార్యదర్శి మోనార్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని కలిసి దివ్యాంగ నేతలు వినతిపత్రం అందజేశారు.
దివ్యాంగుల సమితి విజ్ఞప్తిపై చిన్నారెడ్డి సానుకూలంగా స్పందించారు. వెంటనే కుషాయిగూడ ఏసీపీకి ఫోన్ చేసి మాట్లాడారు. గత నెల 15వ తేదీన జితేందర్ శర్మపై దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకుని, రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా సమస్యను పరిష్కారానికి హామీ ఇచ్చినందుకు చిన్నారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.