Balanagar PHC | బాలానగర్, మే 28 : బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం వినాయక నగర్లోని కార్యాలయంలో బాలానగర్ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయనిర్మల తమ సిబ్బందితో కలిసి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు కావలసిన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానన్నారు. ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలతోపాటు ఇతర రోగులు కూడా తరచూ వచ్చి పలు చికిత్సలతోపాటు వైద్య సేవలు పొందుతున్నారని తెలియజేశారు. బాలానగర్ మెడికల్ ఆఫీసర్గా సీనియర్ వైద్యులు రావడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ రాములమ్మ సూపర్వైజర్ రవికుమార్, స్వరూప రజిత యామిని పాపమ్మ ఎంపిహెచ్ఎ రోహిణి పాల్గొన్నారు.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Jio Electric Scooter | మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవీ ఆ స్కూటర్ ప్రత్యేకతలు