Plastic Use | మల్లాపూర్, కాప్రా 5 : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాప్రా సర్కిల్ ఏపీఐఐసీ కాలనీ సాయి సుధీర్ డిగ్రీ కాలేజ్ , పీజీ కాలేజ్ ఈసీఐఎల్ విద్యార్థిని విద్యార్థులు, కాప్రా సర్కిల్ శానిటేషన్ విభాగము సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాప్రా సర్కిల్ ఏఎంఓహెచ్ మధుసూదన్ మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశం ప్రాముఖ్యతను తెలియజేస్తూ పౌరులుగా మన వంతు బాధ్యతను నిర్వర్తించి ప్రపంచ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి.. అలాగే సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం ఆవశ్యకతను తెలియజేశారు.
ర్యాలీలో పారిశుద్ధ్య సిబ్బంది, ఎస్ఎఫ్ఏలు డప్పులు వాయిద్యాలతో చిందులు వేస్తూ ప్లాస్టిక్ మహమ్మారి రాక్షసుడి వేషధారణలో ప్రదర్శన ద్వారా జూట్ బ్యాగుల పేపర్ బ్యాగులు కానీ, వెదురు, స్టీల్ పాత్రల వాడకం ద్వారా రోజువారి వాడకంలో ప్లాస్టిక్ పాత్రను తగ్గించే విషయాన్ని కాలనీవాసులకు, వ్యాపారస్తులకు తెలియజేశారు. 120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని అలా విక్రయించి, వినియోగించే వారిపై పెనాల్టీ విధించనున్నట్టు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ మధుసూదన్ రావు, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ జవాన్లు, రాజన్, సుధీర్, దేవేందర్, శ్రీనివాస్, అశోక్ మరియు ఎస్ఎఫ్ఏలు శివకృష్ణ, లక్ష్మి, మంజుల, వసంత, సుజాత, శిరీష ,సంజీవ, అశ్విన్ ప్రసాద్ అరవింద్, రాజకుమార్, ఇంచార్జ్ ఎస్ఎఫ్ఏ వరలక్ష్మి, అంజలి, పారిశుద్ధ్య సిబ్బంది, సాయి సుధీర్ డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్ ఎన్సిసి విభాగము ఏ ఎన్ ఓ, లెఫ్టినెంట్ బి. విజయ్, వారి విద్యార్థులు పాల్గొన్నారు.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు