Kothuru | కొత్తూరు, ఏప్రిల్ 19 : కొత్తూరు పురపాలక సంఘం 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను రూ. 40.41 కోట్లుగా ఆమోదించింది. మున్సిపల్ చైర్పర్సన్ బాతుక లావణ్య దేవేందర్యాదవ్ ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. రూ. 9.43 కోట్లు సాధారణ నిధుల నుంచి, గ్రాంట్లు 30.98 కోట్లు మొత్తం 40.41 కోట్లుగా నిర్ణయించారు. బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని చెప్పారు. అలాగే సమస్యలు, ప్రొటొకాల్ విషయంలో అధికారులు తమ మాటలు వినడంలేదని పలువురు కౌన్సిలర్లు చెప్పినట్లు సమాచారం. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ, వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాసులు, సోమ్లానాయక్, అనిత, హేమ, జయమ్మ, కరుణశ్రీ, ప్రసన్నలత, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.