మొయినాబాద్, జనవరి 3: విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తూ ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నట్లు జనగాం ఎమ్మెల్యే, బీజేఐఈటీ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూలోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల 25 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బుధవారం సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 25 ఏండ్ల క్రితం నాలుగు బీటెక్ కోర్సులు 180 మంది విద్యార్థులతో ఈ విద్యా సంస్థ ప్రారంభమైందన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన చేయించి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సాయిబాబారెడ్డి, డీన్ పద్మజా, సీనియర్ అడ్మినిస్ట్రేటర్ వెంకటాచలం పాల్గొన్నారు.