తుర్కయంజాల్, జూన్ 25: నమస్తే తెలంగాణ పత్రికలో పార్కు స్థలం కబ్జాకు యత్నం శీర్షికతో ఈ నెల 14న ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా బుధవారం తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి కమ్మగూడ అనుమను ఎన్క్లేవ్ కాలనీ సర్వే నంబర్ 227, 228లోని సుమారు 871 గజాల పార్కు స్థలంలో మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా తొర్రూర్‌లోని సైబర్ సీటిలోని 2000 గజాల పార్కు స్థలంలో సైతం మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పార్కు స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.