చేవెళ్ల రూరల్, నవంబర్ 1: సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఇన్చార్జి జడ్పీ సీఈవో రంగారావు అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండల పరిధిలోని చందిప్ప, ఎల్వర్తి గ్రామాల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సా మాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేస్తున్నామని, తప్పులకు ఆస్కారం లే కుండా అంకిత భావంతో సిబ్బంది పని చే యాలని సూచించారు. ఆయన వెంట ప్రత్యేక అధికారి సురేశ్, ఎంపీడీవో వెంకయ్యగౌడ్, తహసీల్దార్ సురేందర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
యాచారం: మండల పరిధిలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పక్కాగా చేపట్టాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి, మండల ప్రత్యేకాధికారిణి సంధ్యారాణి సూచించారు. మండల పరిధిలోని గున్గల్, గడ్డమల్లాయగూడ గ్రామాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. కుటుంబ సర్వే నిర్వహిస్తున్న తీరును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎలాంటి ఆటంకాలు లేకుం డా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సర్వే లో కుటుంబ యాజమాని, కుటంబ సభ్యుల పూర్తి వివరాలు సేకరించాలన్నారు. సర్వే చేసి న ఇంటికి స్టిక్కర్‌ను అంటించాలని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు సూచించారు. అధికారులు చేపడుతున్న సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీ వో నరేందర్‌రెడ్డి, ఎంపీవో శ్రీలత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు: ఈ నెల 6 నుండి 19 వరకు ప్ర భుత్వం నిర్వహించే సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి నేటి నుంచి 6వ తేది వరకు మండలంలోని 13 గ్రామ పంచాయతీలతో పాటు ఆమనగల్లు మున్సిపాలిటీలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినట్లు ఎంపీడీవో కుసుమ మాధురి, కమిషనర్ వసంత తెలిపారు. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్యుమరేటర్లతో కలిసి వారు ఇంటింటి సర్వే చేపట్టారు.కార్యక్రమంలో ఎన్యుమనేటర్లు పాల్గొన్నారు.
తుర్కయాంజాల్: ప్రభుత్వం చేపట్టనున్న స మగ్ర కుటుంబ సర్వేకు ప్రజలంతా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సిబ్బంది ఇంటింటికీ తిరిగి స్టిక్కర్లు అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 6 నుంచి సర్వే ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ము న్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కోశికె అయిలయ్య, తదితరులు పాల్గొన్నారు.
మంచాల: కులగణనలో భాగంగా ఇంటింటి సర్వేకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని ఎంపీడీవో బాలశంకర్, తహసీల్దార్ ప్రసాద్‌రావు, ఎంపీవో ఉమారాణి అన్నారు. మండల కేంద్రంతో పాటు తాళ్లపల్లిగూడలో శుక్రవారం ఇంటింటి సర్వేలో భాగంగా ఇంటి నంబర్లు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సర్వేకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శ్రీనివా స్ తదితరులు పాల్గొన్నారు.