ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 24 : దేవాలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని దండుమైలారం గ్రామంలో యాదవసంఘం ఆధ్వర్యంలో నిర్మించిన రేణుకా ఎల్లమ్మ, మల్లన్నస్వామి దేవాలయం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్‌తో కలిసి హాజరై పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు సత్తువెంకటరమణారెడ్డి, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ చైర్పర్సన్ ఈశ్వరమ్మయాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు, చీరాల రమేశ్, సర్పంచ్ మల్లీశ్వరి, సహకార సంఘం చైర్మన్ వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ వెంకటేశ్, యాదవసంఘం నాయకులు పాల్గొన్నారు.
మంచాల : ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. మంచాల గ్రామంలోని హరిహర మహాక్షేత్ర ఆలయ పున: నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురాతన హరిహర క్షేత్రంతో పాటు ఆంజనేయస్వామి దేవాలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులు శ్రీకారం చుట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. దేవాలయ పునర్నిర్మాణ పూజా కార్యక్రమంలో జడ్పీటీసీ నిత్య, మాజీ ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు దండెం రాంరెడ్డి విరాళాలు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెకంటరమణారెడ్డి, ఎంపీపీ నర్మద, సహకార సంఘం చైర్మన్ పుల్లారెడ్డి, సర్పంచ్ జగన్‌రెడ్డి, ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, ఉపసర్పంచ్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్, : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ రైతువేదికలో రైతుసంఘం నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. రైతును రాజుగా మార్చటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సమితి చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మొద్దు అంజిరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, ఏఈవో రఘు తదితరులు పాల్గొన్నారు.