హైదరారాబాద్-బీజాపూర్ రోడ్డు పనులు షురూ
: హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడెప్పుడా అని స్థానికులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డు వస్తున్న నిర్మాణాలను కూల్చివేతలకు సోమవారం శ్రీకారం చుట్టారు.
- అధికారుల పర్యవేక్షణలో నిర్మాణాల కూల్చివేత
మొయినాబాద్, డిసెంబర్ 12 : హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడెప్పుడా అని స్థానికులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డు వస్తున్న నిర్మాణాలను కూల్చివేతలకు సోమవారం శ్రీకారం చుట్టారు. చేవెళ్ల రెవెన్యూ డివిజన్లో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం 331 ఎకరాల భూమి అవసరమని గుర్తించి భూసేకరణను అధికారులు పూర్తి చేశారు. 331 ఎకరాల భూమి, నిర్మాణాలకు సంబంధించి రూ.164 కోట్ల పరిహారం చెల్లించడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేశారు.
జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం 2018లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 కంటే ముందే నిర్మించిన నిర్మాణాలకు మాత్రమే పరిహారం చెల్లించబడుతాయని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. దాని ప్రకారమే రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి, నిర్మాణాలు కోల్పోతున్న బాధితులకు పరిహారం చెల్లింపులు మొదలు పెట్టింది. ఇప్పటికే 212 ఎకరాల భూమికి, నిర్మాణాలకు సంబంధించి రూ.102 కోట్ల పరిహారం సంబంధిత బాధితుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు.
ఇప్పటి వరకు పరిహారం అందించిన భూములలో పనులు చేయడంతో పాటు పరిహారం అందిన నిర్మాణాలను కూల్చివేసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. సోమవారం హిమాయత్నగర్ రెవెన్యూలో కొన్ని నిర్మాణాలు కూల్చివేయడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొన్ని వ్యాపార డబ్బాలను తొలగించారు. చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్రావు, తహసీల్దార్ అశోక్కుమార్ల ఆధ్వర్యంలో నిర్మాణాలను కూల్చివేశారు. భూములు, భవనాలు కోల్పోతున్న వారికి గడువు ఇచ్చామని, ఆ గడువు లోగా స్పందించకపోతే రోడ్డు పనులు మొదలు పెట్టడం ఖాయమని తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

