కొత్తూరు, మార్చి 12: పశు సంపద అనేది దేశానికి, రాష్ర్టానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే వనరు. ఒక దేశంలో ఉండే పశువుల సంఖ్యను బట్టి ఆ దేశంలో జరిగే వ్యవసాయాన్ని అంచనా వేయవచ్చు. ముఖ్యంగా వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, పాలిచ్చే ఆవులు, బర్రెలు, అలాగే మాంస ఉత్పత్తికి అవసరయ్యే మేకలు, గొర్రెలు ఇలా వ్యవసాయానికి అనుబంధంగా పశువుల పెంపకంతో రైతు ఉపా ధి పొందుతున్నాడు. అయితే పెంచే పశువులు ఆరోగ్యంగా ఉంటేనే రైతుకు లాభం. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నది. సీజనల్గా వచ్చే వ్యా ధుల నుంచి పశువులను కాపాడటానికి కృషి చేస్తున్నది.
పశువులకు సరైన సమయంలో చికిత్స చేయడం టీకాలు ఇవ్వడం, పశుగ్రాసం కోసం విత్తనాలు అందించండమే లక్ష్యంగా పశు సంవర్థక శాఖ పనిచేస్తున్నది. 894 ఆవులు, గేదెలు, దూడలకు, 1680 గొర్రెలు, మేకలకు, 46 కుక్కలకు నట్టల నివారణ మందులు వేశారు. 3393 గొర్రెలకు టీకాలు వేశారు. 4 నంచి 8 నెలల మధ్య ఉన్న 750 ఆవు లేగలు, లేగ దూడలకు బ్రూసెల్లా వ్యాధి నివారణ టీకాలు వేశారు.
పశుగ్రాస విత్తనాలు పంపిణీ వివరాలు ఎస్ఎస్జీ 898 రకం -2000 కేజీలు, సీఎస్హెచ్ 24 రకం- 1000 కేజీల విత్తనాలను 278 మంది రైతులకు పంపిణీ చేశారు.
మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు, గర్భకోశ వ్యాధుల శిబిరాలను నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా మండంలోని తీగాపూర్, ఇన్ముల్నర్వ గ్రామాల్లో శిబిరాలను ఏర్పాటు చేశాం. ఈ శిబిరాల్లో తీగాపూర్లో 27 పశువులకు చికిత్స చేసి మందులు ఇచ్చాం. అలాగే 39 దూడలకు పట్టల నివారణ మందు పంపిణీ చేశాం. అలాగే ఇన్ముల్నర్వలో 60 దూడలకు నట్టల నివారణ మందులు తాపించాం. 32 పశువులకు చూడి పరీక్ష, గర్భకోశ వ్యాధి చికిత్స అందించాం. 15 జబ్బు పడ్డ పశువులకు చికిత్స అందించాం. – స్ఫూర్తి, వెటర్నరీ డాక్టర్, కొత్తూరు మండలం