ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 31: కొత్త ఆశలు, కొంగొత్త ఊహలతో 2023 నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగా యి. శనివారం మధ్యాహ్నం నుంచే సంబురాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి డీజేలు, పటాకుల హోరు మధ్య కేక్ కట్ చేసి కొత్త ఏడాదిని సాదరంగా ఆహ్వానించారు. కళ్ల ముందు మరో ఏడాది కరిగిపోయింది. 2022 సంవత్స రం ముగిసిపోయింది. 2023 కొత్త ఏడాదికి జనం కోటి ఆశలతో స్వాగతం పలికారు. నూతన ఏడాదిని పురస్కరించుకుని శనివారం మధ్యాహ్నం నుంచే ఇబ్రహీంపట్నంతోపాటు జిల్లాలోని పలు ప్రధాన పట్టణాల్లోని బేకరీల కు భలే డిమాండ్ ఏర్పడింది.
ఇబ్రహీంపట్నంలోని శాస్త్ర, అయ్యంగారి, హనీ బేకరీలు, లక్ష్మి స్వీట్హౌజ్ల్లో కేకులను యువత, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి కొనుగోలు చేశారు. అర కిలో కేక్ రూ.200, కిలో కేక్‌ను రూ.400 వర కు విక్రయించారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లోని విద్యార్థినీవిద్యార్థులు నూ తన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు.
షాద్‌నగర్‌లో..
షాద్‌నగర్ టౌన్, డిసెంబర్ 31: 2023 కొత్త ఏడాదికి జనం కోటి ఆశలతో స్వాగతం పలికారు. న్యూ ఇయర్‌ను ఉత్సాహంగా జరుపుకొన్నారు. శనివారం కేకుల వ్యాపారం జోరు గా సాగింది. షాద్‌నగర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో 50కి పైగా కేకుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి విక్రయించా రు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వివిధ రకా ల్లో తయారు చేసి అందుబాటులో ఉంచారు. పలు బేకరీల్లో తయారు చేసిన బర్బీ బొమ్మ, పవర్ బొకే, కారు, పవర్ బుట్టి, ట్రైన్‌తో పాటు వివిధ రకాల బొమ్మల కేకులు చూపరులను ఎంతోగానే ఆకట్టుకున్నాయి.
2022కు వీడ్కోలు పలుకుతూ..
చేవెళ్లటౌన్ : 2022కు వీడ్కోలు పలుకుతూ చేవెళ్ల ప్రజలు 2023కు ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలోకి అడుగీడగానే ప్రతి ఒక్కరూ బంధువులు, ఆత్మీయులు, స్నేహితులకు విషెష్ చెప్పారు.
అందరి ఇండ్లలో ఆనందాన్ని నింపాలి
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 2023 ఏడాది జిల్లాలోని అన్ని కుటుంబాల్లో ఆనందాన్ని నింపడంతోపాటు ప్రతి ఒక్కరికీ విజయాలు చేకూరాలని, అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో విభిన్న ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందు కు సాగాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాల్లో జిల్లా ముందంజలో ఉన్నదని, భవిష్యత్తులో నూ ఇదే ఒరవడిని కొనసాగిద్దామని పేర్కొన్నారు. ప్రజలందరూ 2022లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత పట్టుదల, కృషితో విజయాలను కైవసం చేసుకోవాలన్నారు.