హఫీజ్పూర్ భూములకు త్వరలో పరిష్కారం : ఎమ్మెల్యే మంచిరెడ్డి
ఇబ్రహీంపట్నంరూరల్, మే 4 : ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం అనుబంధ గ్రామమైన హఫీజ్పూర్ గ్రామంలోని రైతుల భూ సమస్యకు త్వరలో భూ పరిష్కారం చూపుతామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం హఫీజ్పూర్ గ్రామం పరిధిలో ఉన్న భూముల రైతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..హఫీజ్పూర్ రెవెన్యూ పరిధిలోని 233 ఎకరాలను ఆన్లైన్లో చేర్చాలని ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకెల్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకెల్లి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..1953నుంచి హఫీజ్పూర్ గ్రామం పరిధిలోని 1నుంచి 48వరకుగల సర్వే నెంబర్లలో గల 236 ఎకరాల భూమిని కాస్తు చేసుకుని బ్రతుకుతున్నామని, కానీ ఈ భూమి అటవీ శాఖ పరిధిలో లేనప్పటికి ఆన్లైన్లో చేర్చటం లేదన్నారు.
దీంతో తాము రైతుబంధు సహాయాన్ని కూడా పొందలేకపోతున్నామని అన్నారు. వెంటనే ఈ భూములను ఆన్లైన్లో చేర్పించే విధంగా కృషిచేసి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ రవణమోని మల్లీశ్వరి పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

