షాబాద్, జనవరి 20 : రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని షాబాద్ మాజీ జడ్పీటీసీ జడల రాజేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గూడూరు నర్సింగ్‌రావు అన్నారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రుణమాఫీ కాని రైతులతో కలిసి ముంబయి-బెంగూళూరు లింకు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ రాజేందర్‌గౌడ్ మాట్లాడుతూ కుమ్మరిగూడ గ్రామానికి చెందిన జనమ్మకు రుణమాఫీ కాలేదని ఆమె రైతుధర్నాలో కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చిందని, దీనిపై కాంగ్రెస్ నాయకులు ఏదేదో మాట్లాడడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రెండు విడుతలు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. 26 తర్వాత రైతుభరోసాపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేయడం వంటి చిల్లర చేష్టలు మానుకోవాలన్నారు. రుణాలు మాఫీ కాని ఎంతోమంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ రైతుధర్నాకు జనాలు పెద్ద ఎత్తున రావడంతోనే కాంగ్రెస్ నాయకుల కడుపు మండుతున్నదన్నారు.
రైతుల మీద ప్రేమ ఉంటే సీఎంతో మాట్లాడి రుణాలను మాఫీ చేయించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీరాంరెడ్డి, మాజీ సర్పంచులు పోనమోని కేతన, నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాంచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి, నర్సింహులు, చంద్రశేఖర్, దేవేందర్‌రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ పర్వేద నర్సింహులు, మాజీ ఎంపీటీసీ మంగలి సత్యం, నాయకులు పి. రమేశ్‌యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, బచ్చంగారి నారాయణరెడ్డి, గంగిడి భూపాల్‌రెడ్డి, మల్లేశ్, వెంకట్‌రెడ్డి, ముఖ్రంఖాన్, రాంచందర్, రాజేశ్వర్‌రెడ్డి, యాదిరెడ్డి, పురుషోత్తంచారి, అవిలాశ్గౌడ్, యాదయ్య, మహిళా రైతులు చెన్నమ్మ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.