రంగారెడ్డిజిల్లాలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫార్మాసిటీ లేదని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. బడ్జెట్లో భాగంగా బుధవారం ఫార్మాసిటీ లేదనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీ సాక్షిగానే స్పష్టం చేశారు. సేకరించిన భూముల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోనే ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు చేస్తామని సర్కారు మండలిలో మంగళవారం పేర్కొన్నది. ఫ్యూచర్‌సిటీలో భాగమైన ముచ్చర్లలో యంగ్ ఎండియా, స్కిల్ యూనివర్సిటీ 150 ఎకరాలు, ఫ్యూచర్‌సిటీలో ఏర్పాటు చేసే ఐటీ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పారిశ్రామిక పార్కులతో పాటు మరో 12 పారిశ్రామిక క్లస్టర్లు వంటి వాటికి భూములను కేటాయిస్తున్న ప్రభుత్వం ఫార్మాసిటీకి మాత్రం ఎక్కడా కేటాయించలేదు.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి సరిహద్దులో గ్రీన్‌ఫీల్డ్, ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాని, దానికి ఎక్కడ ఎంత భూమి అనేది తెలియజేయలేదు. ఔషధ తయారీ కంపెనీ, బయోటిక్, లైఫ్, సైన్సెస్ కంపెనీ, యాంటి బయోటెక్, సింథటిక్ డ్రగ్స్ వ్యాక్సిన్లు, న్యూట్రీ స్కూటికల్, హెర్బల్ ఔషధ ఉత్పత్తి, కాస్మొటిక్స్ వంటి వాటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ నిధుల కేటాయింపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఇవి కూడా ప్రకటనలకే పరిమితమవుతాయా.. లేక అటకెక్కుతాయా అనే అనుమానాలు ప్రజల్లో రేకెత్తిస్తున్నాయి.
– రంగారెడ్డి, మార్చి 19 (నమసే ్తతెలంగాణ)
ఫార్మాసిటీపై ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తున్న ప్రభుత్వం అదే సమ యం లో రంగారెడ్డి జిల్లాలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. అయితే ఇప్పటికే అనేక హామీలు తుంగలో తొక్కిన నేపథ్యంలో కొత్త వాటిపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. కోహెడలో రూ.47 కోట్లతో చేపల ఎగుమతి కేంద్రా న్ని ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల్లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ మేరకు ప్రకటించించారు. ఇప్పటికే కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేయటానికి గత బీఆర్ఎస్ ప్రభు త్వం పునాది వేసింది. భూసేకరణ కూడా పూర్తిచేసి నిధులను కూడా కేటాయించిం ది.
ఈ మార్కెట్ పక్కనే చేపల ఎగుమతి మార్కెట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించినా ప్రజల్లో మాత్రం సందేహాలు వస్తూనే ఉన్నాయి. మామిడిపల్లిలో వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, పశువైద్య టీకా ఉత్పత్తికేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రక టించింది. కానీ నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం హైదరాబాద్ శాంతినగర్‌లో ఉన్న వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను మామిడిపల్లికి తరలిస్తామని తెలిపింది. బడ్జెట్లో రూ.300 కోట్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. కొత్త వ్యాక్సినేషన్ ఆవిష్కరణతో పాటు వాటిని తయారు చేయటం కోసం వంద కోట్లతో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నది..హడావుడి ప్రకట నలు సరేకానీ.. ఆచరణలోకి తెస్తారా అని స్థానికుల సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని వర్గాలను అసంతృప్తికి గురిచేసింది
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు. ముఖ్యంగా తాగు, సాగునీరు రంగాలతో పాటు ఎస్సీ, ఎస్టీ మైనార్టీల అభివృద్ధి రంగాలకు కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. రంగారెడ్డిజిల్లాలో శాశ్వత సాగునీరు లేకపోవటం వలన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. భూగర్భజలాలు అడుగంటి బోర్లు కూడా ఎండిపోయాయి. ఈ పరిస్థితిలో జిల్లాకు శాశ్వత సాగునీరు అందించే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు లేదు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన విద్యనందించే చర్యలకు కూడా నిధులు కేటాయించకపోవటం బాధాకరం. అలాగే, ఆరు గ్యారెంటీల అమలుకు కూడా సరిగ్గా నిధులు కేటాయించకపోవటం వలన ప్రజలకు ప్రయోజనం కలిగే అవకాశాలు లేవు.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు