కడ్తాల్, నవంబర్ 30: సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, మైసిగండి మైసమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికై తొలిసారి కల్వకుర్తి నియోజకవర్గానికి విచ్చేసిన ఆయనకు కడ్తాల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు భాస్కర్‌రెడ్డి, హన్మానాయక్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ అమ్మవారిని తన శ్రీమతి మాధవితో కలిసి ఎమ్మెల్సీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నా రు. జిల్లాలోని మైసిగండి మైసమ్మ ఆలయ అభివృద్ధితోపాటు మైసిగండిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సహకరిస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్సీని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మైసిగండి గ్రామంలో ఎమ్మెల్సీ నిధులు రూ.10లక్షలతో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పీహెచ్సీ వరకు చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతినెలా నిధులను విడుదల చేస్తున్నదని, పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. కడ్తాల్ మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్, ఆలయ ఫౌం డర్ ట్రస్టీ శిరోలీ, ఆలయ నిర్వాహకులు భాస్కర్‌నాయక్, అరుణ్‌కుమార్, నాయకులు సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, హన్మానాయక్, చందోజీ, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వంశీధర్‌రెడ్డి, ప్రేమ్‌రాజ్, శేఖర్‌గౌడ్, జహంగీర్‌అలీ, నర్సింహ, నరేశ్‌నాయక్, మోత్యానాయక్, రాములు, ప్రభులింగం, డాక్టర్ శ్రీనివాస్, రాజు, రమేశ్, మల్లేశ్గౌ డ్, సత్యం, రమేశ్, శివనాయక్, కిషన్‌నాయక్, జవహర్లాల్, గణేశ్, కృష్ణ, మహేశ్, యాదయ్య, ఆలయ అర్చకులు యాదగిరిస్వామి, చంద్రయ్య, వెంకటేశ్, శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
9న కొబ్బరి కాయల వేలం
మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉన్న లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సం బంధించి కొబ్బరికాయల వేలం కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీన పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మోహన్‌రావు, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీశైలం తెలిపారు. ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొనాలని, ఇందుకు ముందుగా వారు రూ.2 వేలను డిపాజిట్ చేయాలని ఆలయ ఈవో తెలిపారు.