Kadtal | కడ్తాల్, ఫిబ్రవరి 20 : మండలంలో పేద కుటుంబాలకు చెందిన ఆడపడుచుల వివాహానికి ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్ గురువారం పెండ్లి కానుకను అందజేశారు. మండల కేంద్రానికి చెందిన కానుగుల అలివేలు-నాగయ్య కుమార్తె విజయలక్షీ వివాహానికి.. రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ తరుపున పెండ్లి కూతురుకి రూ.21 వేలతోపాటు పట్టుచీరను మాజీ జడ్పీటీసీ అందజేశారు. అదే విధంగా కాన్గుబావి తండాకి చెందిన నేనావత్ అనిత-రాజు కుమార్తె ఝాన్సీ వివాహానికి దశరథ్‌నాయక్ రూ.21 వేలు, పట్టుచీర అందజేయగా, బీఆర్ఎస్ నాయకుడు, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్ రూ.25 వేలు, మాజీ ఉప సర్పంచ్ శారద పాండు నాయక్ రూ.50 వేలు, మాజీ వార్డు సభ్యుడు నేనావత్ లక్ష్మణ్‌నాయక్ రూ.75 వేలు, బీఆర్ఎస్ నాయకులు శంకర్‌నాయక్ రూ.5 వేలు, భీమన్నాయక్ రూ.4 వేలు, శ్రీనునాయక్ రూ. 1000 అందజేశారు.
ఈ సందర్భంగా దశరథ్‌నాయక్ మాట్లాడుతూ.. మండలంలోని నిరుపేద కుటుంబాలకు అన్ని విధంగా అండగా ఉంటామని తెలిపారు. కష్టాల్లో ఉన్న వారి బాధలను తీర్చడానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ తరుపున సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, బీఆర్ఎస్ కడ్తాల్ గ్రామాధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు లాయక్‌అలీ, హెచ్ఆర్ మహేశ్, దాసు, కిషన్, శ్రీకాంత్, వెంకటేశ్, శ్రీశైలం, కృష్ణ, రతన్, సక్రు, వినోద్, రవి, నరేశ్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.