 
                                                            చేవెళ్ల రూరల్, అక్టోబర్ 29 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ శ్రేణులు సత్తా చాటాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన ముడిమ్యాల పీఏసీఎస్ డైరెక్టర్ కేసారం నరేందర్, మాజీ ఉప సర్పంచ్ పట్లోళ్ల ప్రకాశ్‌రెడ్డి, స్థానిక నేతలు కె.మధు, లక్ష్మణ్‌కుమార్, బూర్ల మల్లేశ్‌తోపాటు 50 మంది నాయకులు మాజీ మంత్రి సబితారెడ్డి సమక్షంలో ఆమె నివాసంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, ముడిమ్యాల్ మాజీ సర్పంచ్ శేరి స్వర్ణలత, చేవెళ్ల వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గోనె కరుణాకర్‌రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు సతమతమవుతున్నారని, రేవంత్‌రెడ్డి సర్కార్ రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలన్నారు. ఆ దిశగా నాయకులు కార్యకర్తలు ముందుకు సాగి ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలను తెలియజెప్పేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఇంటింటికీ తిరుగూ కాంగ్రెస్ బాకీ కార్డు చూపుతూ రేవంత్ సర్కార్ ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలుపాలన్నారు. మాజీ మంత్రిని కలిసినవారిలో బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు శేరి రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ మాధవరెడ్డి, సీనియర్ నేతలు మాజీ ఉప సర్పంచ్‌లు శేరి శ్రీనివాస్, గోనె మాధవ్ రెడ్డి, నాయకులు బ్యాగరి శివకుమార్, బి.శ్రీనివాస్, మధుసూదన్‌గౌడ్, కె.రాము ఉన్నారు.
 
                            