చేవెళ్లటౌన్/మొయినాబాద్, అక్టోబర్ 4 : ప్రజల కోసమే.. పట్లోళ్ల కుటుంబం అని, చేవెళ్ల ప్రాంత ప్రజల గుండెల్లో ఇంద్రారెడ్డి కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. స్వర్గీయ ఇంద్రారె డ్డి జయంతి సందర్భంగా చేవెళ్ల మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి, కౌకుంట్ల గ్రామంలోని సమాధి వద్ద కుటుంబసభ్యులు కార్తీక్‌రెడ్డి, కల్యాణ్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, రంగారెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి సబితారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ.. పట్లోళ్ల కుటుంబ రాజకీయ ప్రస్థానం ప్రజల కోసమే ఆరంభమైందన్నారు.
ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులకంటే ప్రజలే ముఖ్యమంటూ నిరంతరం ప్రజల బాగు కోసమే పరితపించారని కొనియాడారు. పట్లోళ్ల కుటుంబ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఇప్పటికీ మమ్మల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంటారని.. ఎవరెన్నీ అడ్డంకులు, అవరోధా లు, విమర్శలు చేసినా ప్రజల పక్షమే ఉంటామని స్ప ష్టం చేశారు. ఇంద్రారెడ్డి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చిరకాలం గుర్తుండిపోతారన్నారు. అదేవిధంగా ఇం ద్రారెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య పూలమాలవేసి నివాళులర్పించారు.
ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, జిల్లా నాయకులు కొత్త నర్సింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎంఏ రావూఫ్, జయవంత్, నర్సింహాగౌడ్, కృష్ణారెడ్డి, సుధాకర్‌యాదవ్, జగన్మోహన్రెడ్డి, వెంకట్‌రెడ్డి, గణేశ్‌రెడ్డి, శ్రీనివాస్, షేక్‌మహబూబ్, రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీలు బాల్‌రాజ్, విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, చేవెళ్ల మాజీ వైస్ ఎంపీపీ శివప్రసాద్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ప్రధాన కార్యదర్శి హన్మంత్‌రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాపారావు, చేవెళ్ల వ్యవసాయ మార్కె ట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు, సర్పంచ్‌లు మాణిక్యారెడ్డి, జహంగీర్, రామచంద్రయ్యగౌడ్, చేవెళ్ల మండల మాజీ యూత్ అధ్యక్షుడు శేఖర్, ఎల్లయ్య, వెంకటేశ్, కృష్ణ, ఆంజనేయులు, నరేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మాధవ గౌడ్, వైభవ్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, బాల్‌రాజ్, రాజశేఖర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.