మంచాల, మే 13 : ఎండాకాలం వచ్చిందంటే చెట్లు మొత్తం మోడుబారి పోవడంతోపాటు ప్రకృతి రమణీయత కూడా దెబ్బతింటుంది. అయితే మండలంలోని పలు గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి మండు వేసవిలోనూ పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి.
అకాల వర్షా లు కురువడంతో చెట్లు పచ్చటి ఆకులు, పూలతో వాహనదారులు, సందర్శకులకు ఆకట్టుకుంటున్నాయి. మండలంలోని పలు ప్రధాన రోడ్లపై ఉన్న వివిధ రకాల చెట్లు పచ్చదనం పరుచుకున్నాయి.