Employment guarantee work | జహీరాబాద్, జూలై 21 : మున్సిపాలిటీలో వీలీనమైన గ్రామాల్లో ఉపాధి హామీ పనులను కల్పించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బీ రామచందర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని శ్రామిక భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జహీరాబాద్ మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
జహీరాబాద్ మండలంలోని రంజోల్, హోతి కే, చిన్న హైదరాబాద్, పాస్తాపూర్, అల్లీపూర్, కోహిర్ గ్రామాలలో ఉపాధి హామీ పనులను బందు చేయడం మూలంగా వ్యవసాయ పనులు చేసుకునే కూలీలు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉపాధి కోల్పోయినటువంటి వ్యవసాయ కూలీలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి విషయంలో జోక్యం చేసుకొని ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని కోరారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని అన్నారు.
జహీరాబాద్ మండల కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా ఎస్ సుకుమార్, ప్రధానకార్యదర్శిగా బీ నర్సింహులు, ఉపాధ్యక్షులుగా తుల్జరాం, కౌడి నర్సింహులు, ఇస్మాయిల్, లలితమ్మ, సహా కార్యదర్శిలు గా పెంటమ్మ, లక్ష్మిన్, బుద్దు, చిరంజీవి, లింగం, సంజీవ్, లక్ష్మణ్, కోశాధికారిగా గోవర్ధన్, సోషల్ మీడియా కన్వీనర్ గా రాజు, కమిటీ సభ్యులుగా బాలరాజ్, నర్సమ్మ, పెంటప్ప, బీరప్ప, రాజు, నర్సింహులు, నర్సప్ప, సుబ్బమ్మ, రత్నయ్య తదితరులను ఎన్నుకున్నారు.