వికారాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రాహుల్‌శర్మ
పరిగి, మే 2 : గ్రామకంఠం సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని వికారాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులకు సూచించారు. మంగళవారం పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో పల్లె ప్రకృతివనం, నర్సరీ, సెరిగేషన్, కంపోస్టు షెడ్డు, పరిగి మున్సిపల్ పరిధిలో చేపట్టిన లే అవుట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లే అవుట్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపట్టాలని ఆదేశించారు.
లే అవుట్లను తరచుగా పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్‌కు చెప్పారు. హరితహారం కార్యక్రమం కోసం మొక్కలు సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. మొక్కలు ఏపుగా పెరిగేలా చూడాలన్నారు. నర్సరీ నిర్వహణపై రాహుల్‌శర్మ సంతృప్తి వ్యక్తం చేశారు. కంపోస్టు ఎరువు తయారీని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, ఎంపీవో దయానంద్, ఏపీవో ఉష, ఈసీ ప్రభాకర్, బసిరెడ్డిపల్లి సర్పంచ్ సూరప్ప పాల్గొన్నారు.