రంగారెడ్డి, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : నో పేపర్.. ఫైళ్లతోపాటు అన్ని రకాల కార్యకలాపాలు ఆన్లైన్లోనే. పాలనలో పారదర్శకత కోసం అమ లు చేస్తున్న ఈ-ఆఫీస్ రంగారెడ్డి కలెక్టరేట్లో అం దుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం 8 శాఖల్లో ఈ విధానం అమలవుతున్నది. మిగిలిన అన్ని శాఖల్లో నూ మూడు నెలల వ్యవధిలో అందుబాటులోకి తెచ్చేందుకు డీఐవో, ఎన్ఐసీలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ విధానంతో ఫైళ్ల క్లియరెన్స్‌లో జా ప్యం ఉండక..ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఎనిమిది శాఖల్లో అందుబాటులోకి ..
కొంతకాలంగా ఈ-ఆఫీస్ కార్యకలాపాలను అం దుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపంలోకి వచ్చాయి. కలెక్టర్ శశాంక ప్రత్యేక చొరవ చూపడంతో అనతికాలంలోనే ఈ-ఆఫీస్ సేవలు కలెక్టరేట్లో అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశలో వ్యవసాయ, ముఖ్యప్రణాళిక, పం చాయతీరాజ్, మైనార్టీ సంక్షేమ, మెప్మా, మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ, సీనియర్ సిటిజన్, ఎస్సీ డెవలప్మెంట్, డీఆర్డీఏ శాఖల్లో ఈ-ఆఫీస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొద్దిరోజుల కిందట కలెక్టర్ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందే అధికారులకు టెక్నికల్ అసిస్టెంట్లతో శిక్షణ ఇప్పించారు.
ఇంటి నుంచీ పని చేయొచ్చు..
ఈ-ఆఫీస్ అమలవుతున్న కార్యాలయంలో కాగితంతో పనిఉండదు. ఫైళ్ల బదలాయింపు కోసం అధికారులు ప్రత్యేకంగా భేటీ అయి చర్చోపచర్చ లు జరపాల్సిన అవసరమూ ఉండదు. కంప్యూటర్ స్క్రీన్‌పై ఫైళ్లను చూసుకుంటూ ఫోన్ ద్వారా చర్చించుకుని ఫైల్ మూవింగ్ చేసుకోవచ్చు. ఈ-ఆఫీస్ కార్యకలాపాల్లో భాగంగా ప్రతి ఉద్యోగికీ ఐడీ, పాస్‌వర్డ్‌లను కేటాయించారు.
సదరు ఉద్యోగి, అధికారి మాస్టర్ డాటాకు లింగ్ అయి ఉండడం వల్ల ఎక్క డా..ఫైల్ మూవింగ్‌లో జాప్యం ఉండదు. ఒకవేళ జాప్యం జరిగితే అందుకుగల కారణాలపై ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అత్యవసరమనుకున్న ఫైల్‌ను సెక్షన్ అధికారి నుంచి కలెక్ట ర్ వరకు అరగంటలో పంపించొచ్చు. ఫైల్ మిస్సింగ్కూ ఆస్కారం ఉండదు. ఫైల్ ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లింది? ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు. ఆఫీసు లో లేనప్పుడు ఇంటి నుంచి కూడా పనిచేసేందుకు ఈ-ఆఫీస్ విధానం దోహదపడుతుంది.
పారదర్శకత.. జవాబుదారీతనం..
ఈ విధానం ద్వారా పారదర్శకత, జవాబుదారీత నం ఉండనున్నది.. కార్యాలయాల్లో దస్త్రం వివరాలను దరఖాస్తుదారుడు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. రికార్డులను మార్చడం వంటివాటికి చెక్ పడుతుంది. నిన్నమొన్నటి వరకు ఫైళ్ల క్లియరెన్స్ కోసం రోజుల తరబడిగా నిరీక్షించాల్సి వచ్చేది. ఇక పై ఆ పరిస్థితి ఉండదు. సమయం ఆదా కావడంతోపాటు పనులు త్వరగా అవుతాయి.