శిగమూగిన లష్యర్
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో ఆదివారం లష్కర్‌వారం సందర్భంగా మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
- లష్కర్ వారానికి పోటెత్తిన భక్తజనంమల్లన్నను దర్శించుకున్న
- 50 వేల మంది భక్తులు ఉదయం 5గంటల నుంచే క్యూలైన్
చేర్యాల, జనవరి 28 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో ఆదివారం లష్కర్‌వారం సందర్భంగా మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మల్లన్న స్వామి మమ్మేలు అంటూ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
శనివారం సాయంత్రం నుంచే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ పరిధిలో దాతల గదులు ఖాళీగా లేకపోవడంతో ప్రైవేటు గదులు కిరాయికి తీసుకుని బస చేశారు. ఆదివారం వేకువ జామునే నిద్రలేచి కోనేటిలో స్నానాలు ఆచరించి క్యూలో వెళ్లి మల్లన్నస్వామిని దర్శించుకున్నారు.

అభిషేకం, అర్చన, ఒడి బియ్యం, కొబ్బరికాయలు, పట్నాలు, బోనాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి 50వేల మంది భక్తులు వచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు.
వేకువజామునే ప్రారంభమైన దర్శనాలు
వేకువజామున 5 గంటల నుంచే స్వామివారిని దర్శించుకునేలా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం, ధర్మ దర్శనం తదితర కౌంటర్లను తెరిచి టిక్కెట్లను విక్రయించారు. అనంతరం గుట్టపై ఉన్న ఎల్లమ్మను దర్శించుకుని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు, ఏఈవో గంగా శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది భక్తులకు సేవలందించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

