ఇబ్రహీంపట్నం : రిసార్టులు, ఫామ్‌హౌస్‌ల్లో ముజ్రా, రేవ్ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆమె ఇబ్ర హీంపట్నం ఏసీపీ కార్యాలయ ఆవరణలో రిసార్టులు, ఫామ్‌హౌస్‌ల నిర్వాహకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం పరిధిలో క్రైం రేట్ తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఫామ్‌హౌస్‌లు, రిసార్టుల పూర్తి వివరాలను ఆయా మండలాల స్థానిక ఠాణాల్లో పొందుపర్చినట్లు చెప్పారు. వీకెండ్లో నిర్వహించే కార్యక్ర మాల్లో మద్యం, గంజాయి వంటి వాడకాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌తో రేవ్, ముజ్ర పార్టీలు నిర్వహించాలని చూస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.