కొడంగల్ : జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశానుసారంగా కొడంగల్ పట్టణ అంబేద్కర్ కూడలిలో ఆదివారం తెల్లవారు జామున నిర్వహించిన నాఖాబంధిలో భాగంగా అక్రమంగా తరలిస్తున్న రెండు కలప లారీలను పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న రెండు కలప లారీలను పట్లుకున్నట్లు తెలిపారు.
రెండు లారీల కలప ధర దాదాపు రూ. 10లక్షల విలువ ఉంటుందని, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు చెందిన నయూమోద్దిన్, షకీల్పై కేసు నమోదు చేసి పట్టుబడ్డ లారీలను అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. అక్రమ రవాణకు పాల్పడితే పీడీ యాక్ట్ కేసులకు బాధ్యత వహించాల్సి వస్తుందని సీఐ హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.