కడ్తాల్ : మండల కేంద్రంతోపాటు పరిధిలోని గాన్గుమార్లతండా పంచాయతీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జరిగిన వేలంపాటలో లడ్డూను మునావత్ రాకేశ్‌నాయక్ రూ.2.10 లక్షలకు, చిన్న లడ్డూను బానోవత్ శంక్ర్నాయక్ రూ.1.55 లక్షలకు, మరో చిన్న లడ్డూను సభావట్ నర్సింగ్ రూ.1.51 లక్షలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్లు సేవ్యానాయక్, వెంకటేశ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్, పార్టీ మండల అధ్యక్షులు నర్సింహ, బిచ్చానాయక్, మాజీ ఎంపీటీసీ రాములు, నాయకులు భీక్యానాయక్, లక్పతినాయక్, శ్రీను, భీమన్, రాజు, శంకర్, జగన్, శ్రీకాంత్, లక్ష్మయ్య, మల్లయ్య, శివగౌడ్, మహేందర్‌గౌడ్, యాదయ్య, రాజేందర్‌గౌడ్, మల్లేశ్‌గౌడ్, మహేశ్, రవి, ప్రవీణ్, కార్తీక్ పాల్గొన్నారు.
షాబాద్ : మండలంలోని కుమ్మరిగూడ, షాబాద్ తదితర గ్రామాల్లో వినాయకుడిని ఊరేగింపుగా తీసుకువెళ్లి షాబాద్ పహిల్వాన్ చెరువులో నిమజ్జనం చేశారు. షాబాద్ పెద్ద వినాయకుడి లడ్డూను రూ.19లక్షల ఒక్క రూపాయికి మహేశ్‌యాదవ్, జడల రాజేందర్‌గౌడ్, తమ్మలి రవీందర్ టీమ్ సభ్యులు వేలం పాటలో దక్కించుకున్నారు. అదే విధంగా కుమ్మరిగూడలో వినాయకుడి లడ్డూను వేలం పాటలో పలువురు కైవసం చేసుకున్నారు.
చేవెళ్ల రూరల్ : చేవెళ్ల మండల పరిధి ఎన్కేపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను బుధవారం రూ.2 లక్షలకు గ్రామస్తుడు కిష్టపురం శ్రీనివాస్‌గౌడ్ కైవసం చేసుకున్నాడు.
పెద్దఅంబర్‌పేట : మున్సిపాలిటీ పరిధి కుంట్లూరు వేంకటేశ్వరకాలనీలో ఏర్పాటుచేసిన వినాయకుడి లడ్డూను రూ.2.23 లక్షలకు చెలికాని గోవర్ధన్‌రెడ్డి, పూజలు నిర్వహించిన కలశాన్ని రూ.2.4 లక్షలకు కట్ట సత్యనారాయణరెడ్డి కైవసం చేసుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అనుపమ సుప్రసేనారెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ బస్వారెడ్డి, ఉత్సవ సమితి అధ్యక్షుడు కొలను ప్రభాకర్‌రెడ్డి, ఆర్ సత్యనారాయణరెడ్డి, వి.గోవర్ధన్, ఎస్.సుధాకర్‌రెడ్డి, ఆర్ పద్మారెడ్డి, బి.అంజయ్య పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని తుర్కగూడ గ్రామంలో నవభారత్యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూ వేలంలో గ్రామానికి చెందిన మార్కెట్‌కమిటీ మాజీ డైరెక్టర్ ఏనుగు బుచ్చిరెడ్డి పాల్గొని బుధవారం రూ.68వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
మొయినాబాద్ : మండల పరిధిలోని సురంగల్ గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన మహాగణపతి వినాయకుడిని మంగళవారం రాత్రి నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా లడ్డూను వేలం పాట వేయగా, గ్రామానికి చెందిన యాలాల విజయభాస్కర్‌రెడ్డి లడ్డూను రూ.3.75 లక్షలకు కైవసం చేసుకున్నాడు. అదే విధంగా హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డూను నిర్డుల ఇంద్రారెడ్డి రూ.1.50 లక్షలకు దక్కించుకోగా, కె నర్సింహగౌడ్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను ఎల్గని బాబయ్యగౌడ్ రూ.47 లక్షలకు కైవసం చేసుకున్నారు.