రంగారెడ్డి, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్ సోమవారం రంగారెడ్డి జిల్లాకు రానున్నారు. షాద్‌నగర్, చేవెళ్లలలో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఉదయం 11.45 గంటలకు షాద్‌నగర్‌లో జరిగే బహిరంగ సభకు హాజరై, అక్కడి నుంచి హెలికాప్టర్లో చేవెళ్ల సభకు చేరుకుని మాట్లాడుతారు. చేవెళ్లలోని ఫరా కాలేజ్ గ్రౌండ్లో, షాద్‌నగర్‌లోని జడ్చర్లకు వెళ్లే మార్గంలో ఉన్న చెన్న రాములు మైదానంలో సభలను నిర్వహిస్తున్నారు.
సీఎం రాకను పురస్కరించుకొని ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో సభా ప్రాంగణాలు గులాబీమయంగా మారాయి. సభా ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, కాలె యాదయ్యలు పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించారు. ప్రజలు భారీగా తరలివచ్చి సభలను జయప్రదం చేయాలని పిలుపు
షాబాద్, నవంబర్ 26 : చేవెళ్లలో సోమవారం జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సీఎం సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. సభ వేదిక అలంకరణ, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాద య్య మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఉదయం 11గంటలకు చేవెళ్లలో నిర్వహించే ప్రజా ఆశీర్వా ద సభకు ముఖ్య అతిథులుగా, బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలిపారు. సీఎం సభకు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు స్వ చ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారన్నా రు.
సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మొయినాబాద్ జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, చేవెళ్ల మాజీ ఎంపీపీ మంగళి బాల్‌రాజ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, దేశమళ్ల ఆంజనేయులు, మద్దూరు మల్లేశ్, మాణిక్యారెడ్డి, కృష్ణారెడ్డి, ప్రభాకర్, శ్రీహరియాదవ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్, నవంబర్ 26 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షాద్‌నగర్ పట్టణంలో సోమవారం సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వం చేసిన ప్రగతి పనులను సీఎం కేసీఆర్ సభలో ప్రజలకు వివరిస్తారని చెప్పారు.
పట్టణంలోని జడ్చర్ల రోడ్డులోని చెన్న రాములు మైదానంలో సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 11.30 గంటలకు సీఎం సభకు చేరుకుంటారని వివరించారు. ఆదివారం సాయంత్రం షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు సభ ఏర్పాటు పనులను పరిశీలించారు.