శంకర్పల్లి : శంకర్పల్లి మండలం మోకిల గ్రామ శివారులోని సబ్వేలో బుధవారం సూపర్ స్టార్ మహేష్‌బాబు తన సతీమణి నమ్రతతో కలిసి చక్రసిద్ ఆసుపత్రిని ప్రారంభించారు. చక్రసిద్ ఫౌండర్ డాక్టర్ సత్యసింధూజ మశేష్బాబు దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ అరుదైన చికిత్సా పద్దతిని అందించే కేంద్రాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు.
ఇది కేవలం వ్యాధిని నయం చేసే పద్దతి మాత్రమే కాదని మొత్తం మన జీవన శైలిని మార్చడంలో సహాయ పడుతుందని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనీ గేయ రచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి, యాంకర్ సుమ, నటుడు రాజీవ్‌కనకాల, శాంత బయోటెక్స్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి, తమ్మినేని భరద్వాజ పాల్గొన్నారు.