తుర్కయంజాల్, ఫిబ్రవరి 6 : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడలో రంగారెడ్డి జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోమ్ సిబ్బంది గత 9 నెలలుగా జీతాలు రావడం లేదని నిరసిస్తూ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ గత 9 నెలలుగా జీతాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురకొంటున్నామని తెలిపారు. జీతాల కొరకు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కోరగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదని నిధులు విడుదల కాగానే సిబ్బందికి జీతాలు అందజేస్తామని అన్నారు. అయితే చిల్డ్రన్ హోమ్ లో పని చేసే సిబ్బందికి రోజువారి వేతనం మాదిరిగా అందజేస్తున్నామని త్వరలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటామని జిల్లా అధికారి తెలిపారు.