శంకర్పల్లి, అక్టోబర్ 29 : తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ హయాంలోనే పల్లెలు ప్రగతి సాధించాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండలంలోని మహాలింగాపురంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించి, అనంతరం ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో చెవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్‌రెడ్డితో కలిసి బీఆర్‌పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.
కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, చైర్పర్సన్ విజయలక్ష్మీ ప్రవీణ్‌కుమార్, జడ్పీటీసీ గోవిందమ్మ, గుడిమాల్కపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మండల, మున్సిపల్ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్ కన్నా, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ రాజూనాయక్, ఏఎంసీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ వెంకటేశ్, మండల ఉపాధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, మున్సిపల్, మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు పాండురంగారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, సర్పంచులు మాణిక్‌రెడ్డి, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, నాయకులు ప్రవీణ్‌కుమార్, గోవర్ధన్‌రెడ్డి, బాలకృష్ణ, కాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్/చేవెళ్ల రూరల్ : బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరిగిందని చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య సతీమణి, నవాబుపేట జడ్పీటీసీ జయమ్మ, నవాబుపేట ఎంపీపీ కాలె భవాని తెలిపారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని పలు కాలనీలతో పాటు కేసారంగ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య కు మద్దతుగా వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎంతో కృషి చేశారని, ప్రగతిని చూసి ఓటేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పీటీసీ మాలతీకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, వైస్ ఎంపీపీ శివప్రసాద్,
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షు డు ప్రభాకర్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రవికాంత్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు వెంకటరంగారెడ్డి, వైస్‌చైర్మన్ నర్సింహులు, మాజీ వైస్ చైర్మన్లు మాణిక్య రెడ్డి, నర్సింహులు, గుడ్డిమల్కాపూర్ మాజీ డైరెక్టర్ యాదగిరి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు శివారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు తోట శేఖర్, ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్, ముడిమ్యాల పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేశ్, సర్పంచ్‌లు నరహరి రెడ్డి, శంకర్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్, వెంకటేశం గుప్తా, మాణిక్య రెడ్డి, జహంగీర్, దర్శన్, భాను, నర్సింహులు, ఉప సర్పంచ్ వెంకటేశ్, డైరెక్టర్లు వెంకటేశ్, ఫాయజ్, సాయినాథ్, మహేశ్, కృష్ణ, నాయక్, నాయకులు రమణారెడ్డి, కృ ష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, రంగారెడ్డి, రాజు, మాణిక్యం, సాయికుమార్ రెడ్డి, నాగార్జున రెడ్డి, చందు, మంగలి బాలయ్య, సత్తి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.