పట్టణ ప్రగతితో పట్టణాల్లో మార్పులు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

షాబాద్ : పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల్లో సమూల మార్పులు జరుగుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం జల్పల్లి మునిసిపాలిటీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జల్పల్లి మునిసిపాలిటీకి ప్రతి నెల రూ. 48లక్షలు నిధులు వస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది జీతాలతో పాటు, చెత్త వాహనాల కొనుగోలు తదితర వాటికి నిధులు వినియోగించడం జరుగుతుందన్నారు. మునిసిపాలిటీలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీల నిర్మాణానికి రూ. 17కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
పార్టీలకతీతంగా కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుని జల్పల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. స్వచ్ఛ జల్పల్లిగా మార్చేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. జల్పల్లి చెరువుకు రూ. 9.50కోట్లు నిధులు మంజూరు చేశామని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. వైరల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. పహడిషరీఫ్ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిన్నట్లు చెప్పారు. మున్సిపాలిటీలోని అన్ని పాఠశాలలకు తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 50లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. చెరువు ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన బడ్జెట్ను పాలకవర్గం ఆమోదించింది. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాధి, వైస్ చైర్మన్ ఫర్హాన నాజ్, మున్సిపల్ కమిషనర్ కుమార్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

