కడ్తాల్, జూలై 5 : మండల కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆదిత్య, హైదరాబాద్‌కి చెందిన నాగేందర్ తమ సెల్ఫోన్లను ఇటీవల కడ్తాల్ పట్టణంలో పొగొట్టుకున్నారు. బాధితులిద్దరూ అదే రోజు తమ సెల్ఫోన్లు పోయాయని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పొగొట్టుకున్న సెల్ఫోన్లలను వెతికి పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం కడ్తాల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ గంగాధర్ బాధితులకు సెల్ఫోన్లను అప్పగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెల్ఫోన్లు పొగొట్టుకున్న వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. దీంతో పొగొట్టుకున్న సెల్ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు అప్పగించడానికి వీలుగా ఉంటుందని పేర్కొన్నారు. పొగొట్టుకున్న సెల్ఫోన్లను బాధితులకు అప్పగించడంలో కృషి చేసిన కానిస్టేబుల్ రాంకోటిని సీఐ అభినందించారు. పొగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను అప్పగించిన పోలీసులకు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్, ఎఎస్ఐ బాల్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.