కొడంగల్, మే 8 : ముందస్తు అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం పాలిస్తుందని.. సీఎం పర్యటన ఉన్నా ప్రతిసారీ బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేయడం ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
నియోకవర్గానికి సీఎం వస్తున్నారంటే అధికారులు, పోలీసులు అరెస్టులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సీఎం వచ్చేది మధ్యాహ్నం అయితే తెల్లవారు జాము నుంచే ముందస్తు అరెస్టులు చేసి ఠాణాల్లో ఉంచడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ నాయకులు లగచర్ల సురేశ్, నరేశ్ పేర్కొన్నారు.